Toxic Movie Review Telugu: చిత్రం: టాక్సిక్‌. నటీనటులు: యశ్‌, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్‌, అక్షయ్‌ ఒబెరాయ్‌, సుదేవ్‌ నాయర్‌, డారెల్లీ డిసిల్వా, అమిత్‌ తివారి తదితరులు సంగీతం: విశాల్‌ మిశ్రా, రవి బస్రూర్‌, తానిష్‌ బాగ్చీ, ఫహీమ్‌ అబ్దుల్లా, అర్సలాన్‌ నిజామీ సినిమాటోగ్రఫీ: రాజీవ్‌ రవి, ఎడిటింగ్‌: ఉజ్వల్ కుల్‌కర్ణి, రచన, యశ్‌, గీతూమోహన్‌దాస్‌, నిర్మాత: వెంకటేశ్‌ కె. నారాయణ, యశ్‌, దర్శకత్వం: గీతూమోహన్‌ దాస్‌. సెన్సార్‌: A సర్టిఫికెట్‌; విడుదల తేదీ: 26-08-26

ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురుచూసిన సినిమాల్లో ఒక‌టి… టాక్సిక్. కె.జి.ఎఫ్‌ చిత్రాల‌తో పాన్ ఇండియా సంచ‌ల‌నంగా మారిన య‌శ్ నుంచి… దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత వ‌చ్చిన సినిమా ఇది. య‌శ్ క‌థానాయ‌కుడిగానే కాకుండా, ర‌చ‌యిత‌గా, నిర్మాత‌గానూ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రేక్ష‌కుల్లో ఉన్న ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి, అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే దేశ‌, విదేశీ మార్కెట్ల‌లో ప్రారంభ వ‌సూళ్ల‌తో అద‌రగొట్టిన ఈ సినిమా ఎలా ఉందంటే..

కథేంటంటే..

Toxic Movie Story || రాయ (య‌శ్‌), గంగ (న‌య‌న‌తార‌) తోబుట్టువులు. త‌ల్లిదండ్రుల్ని కోల్పోయి వీధిన ప‌డ‌తారు. ప‌రిస్థితుల కార‌ణంగా తెలిసీ తెలియ‌ని వ‌య‌సులోనే రాయ ఆయుధం చేత ప‌ట్టి, ర‌క్తం క‌ళ్ల చూడాల్సి వ‌స్తుంది. త‌న త‌మ్ముడి బాధ్య‌త‌ని అక్క తీసుకుంటుంది. చావుపై భ‌యం లేకుండా పెరిగిన ఇద్ద‌రూ పెద్ద‌య్యాక నేర సామ్రాజ్యంలోకి అడుగుపెడ‌తారు. గోవాలో సాల్వెడార్ (డారెల్ డిసిల్వా)కి చెందిన ముఠాతో క‌లిసి ప‌నిచేస్తుంటారు. సాల్వెడార్ కూతురు రెబెకా (తారా సుతారియా)తో రాయ‌కు సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆ త‌ర్వాత చోటు చేసుకున్న కొన్ని అనూహ్య సంఘ‌ట‌న‌ల కార‌ణంగా నదియ (కియారా అడ్వాణీ)కి ద‌గ్గ‌ర‌వుతాడు రాయ‌. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌కు గుర్తుగా నదియా గర్భం దాలుస్తుంది. ఆ బంధం నేర సామ్రాజ్యంలో ఎలాంటి ప్ర‌కంప‌న‌లు సృష్టించింది? రాయ‌కు నదియా ఎందుకు దూరం కావాల్సి వ‌చ్చింది? నదియాకు జ‌న్మించిన బిడ్డ టికెట్ (య‌శ్‌).. త‌న తండ్రి రాయ‌ని క‌లిశాడా? రాయ జీవితంలోకి వ‌చ్చిన మ‌రో అమ్మాయి మెలీశా (రుక్మిణీ వసంత్) ఎవ‌రు? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే..

Toxic Movie Review Telugu || సుల‌భంగా అర్థం కావ‌డానికి ఇదేమీ చంద‌మామ క‌థ కాదు అన్న హెచ్చ‌రిక‌తోనే సినిమా మొద‌ల‌వుతుంది. అందుకు త‌గ్గ‌ట్టే చాలాసేప‌టివ‌ర‌కూ క‌థ‌పై ఓ స్ప‌ష్ట‌మైన అంచ‌నాకి రాలేము. ఇది పాశ్చాత్య దేశాల సినిమాలు, సంస్కృతి ప్ర‌భావం మెండుగా ఉన్న ఓ గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామా. అక్క – త‌మ్ముడు,  తండ్రి – త‌న‌యుడు బంధాల‌తో ముడిప‌డిన భావోద్వేగాల‌తో పాటు, ప్రేమ కోణం కూడా ఉంది. కె.జి.ఎఫ్ చిత్రాల త‌ర్వాత య‌శ్‌ని ప్రేక్ష‌కులు ఎలాంటి పాత్ర‌లో చూడాల‌నుకుంటారో అందుకు త‌గ్గ‌ట్టే ఇందులో క‌నిపించారు. ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన హీరోయిజం, ఎలివేష‌న్లు, యాక్ష‌న్ స‌న్నివేశాలు సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. 1947 నేప‌థ్యంలో సినిమా ఆరంభం అవుతుంది. పాత్రలు ఒక ప‌ట్టాన అర్థం కావు. చేతులు, కాళ్లు, త‌ల‌ల మాత్రం ఎగిరి ప‌డుతుంటాయంతే.  శ్రుతిమించిన కాల్పుల మోత‌, ర‌క్త‌పాతం త‌ప్ప క‌థ, భావోద్వేగాల‌పై ఏమాత్రం దృష్టిపెట్ట‌లేదు ద‌ర్శ‌కురాలు. కియారా పోషించిన నదియా పాత్ర ప్ర‌వేశం త‌ర్వాతే  కాస్త సినిమా గాడిన ప‌డిన‌ట్టుగా అనిపిస్తుంది. అప్ప‌టివ‌ర‌కూ సాగేదంతా యాక్ష‌న్ హంగామా, భారీ ఖర్చుతో కూడిన విజువ‌ల్స్ మాత్ర‌మే. విరామానికి ముందు వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకి ప్ర‌ధాన బ‌లం. గంగ, రెబెకా, నదియా పాత్ర‌ల మ‌ధ్య వ‌చ్చే నాట‌కీయ స‌న్నివేశాలు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి.

మంచి మ‌లుపుతో సినిమా ద్వితీయార్ధంపై ఆస‌క్తి పెంచినప్ప‌టికీ గోవా నుంచి మ‌కాం మారుతుంది త‌ప్ప క‌థేమీ మార‌దు. ప్ర‌థ‌మార్ధం త‌ర‌హాలోనే ర‌క్త‌పాతంతో కూడిన స‌న్నివేశాల ప‌రంప‌ర సాగిపోతుంటుంది. రాయ‌, టికెట్ పాత్ర‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణే ద్వితీయార్ధానికి కీల‌క‌మ‌ని అర్థం అవుతుంటుంది కానీ, అది ఎంత‌కీ మొద‌ల‌వదు.  లెక్క‌లేన‌న్ని పాత్ర‌లు, సన్నివేశాలు రాసుకోవ‌డం, పెద్ద‌గా అవ‌స‌రం లేక‌పోయినా పేజీల‌కొద్దీ సంభాష‌ణ‌లు ఉండడంతో నిడివి పెరిగింది. చివ‌ర్లో తండ్రీ త‌న‌యుల మ‌ధ్య డ్రామాతోనైనా సినిమా రక్తి కట్టించాల్సింది. కానీ, దర్శకురాలు ఆ ప్రయత్నం చేయలేదు. అక్క‌డ క‌థ ఓ మ‌లుపు తీసుకున్న‌ప్ప‌టికీ అది ప్రేక్ష‌కుడికి ఆశించినంత తృప్తినివ్వ‌దు. ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టుగా హంగులతో పాటు.. కథ‌, క‌థ‌నాలపై కూడా దృష్టి పెట్టాలని చాలా సినిమాలు చాటుతుంటాయి. ఆ జాబితాలో ఈ సినిమా  కూడా చేరుతుంది.

ఎవ‌రెలా చేశారంటే..

Toxic Movie Cast And Crew || య‌శ్‌ న‌ట‌నే ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఆయ‌న రాయ పాత్ర‌లో మ‌రోసారి కె.జి.ఎఫ్‌ సినిమాలోని రాకీభాయ్‌ని గుర్తు చేశారు. అయితే.. ఆ ప్ర‌భావం నుంచి ఇంకా బ‌య‌టకు రాలేద‌నే విష‌యం మాత్రం అర్థం అవుతుంది. టికెట్‌ పాత్ర‌లో క‌నిపించిన తీరు కూడా చాలా బాగుంది. కియారా పాత్ర సినిమాకి ప్ర‌ధానబ‌లం. ఈ సినిమాలో కాస్త‌యినా భావోద్వేగాలు పండాయంటే కియారా పాత్ర‌, ఆమె న‌ట‌నే కారణం. గంగ పాత్ర‌తో న‌య‌న‌తార ప్ర‌థ‌మార్ధంపై బ‌ల‌మైన ప్ర‌భావం చూపిస్తుంది. తారా సుతారియా, హ్యూమా ఖురేషీ పాత్ర‌లూ ఆక‌ట్టుకుంటాయి. ద్వితీయార్ధంలో వ‌చ్చే రుక్మిణీ వ‌సంత్ పాత్ర‌లోనే బ‌లం లేదు. సాంకేతిక విభాగాల్లో రాజీవ్ ర‌వి కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. ర‌వి బ‌స్రూర్ నేప‌థ్య సంగీతం అక్క‌డ‌క్క‌డా ప్ర‌భావం చూపించిందంతే. పాట‌లు పెద్ద‌గా ఆక‌ట్టుకోవు.  ప్రొడ‌క్షన్ డిజైన్ సినిమాకి హైలైట్‌. గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌కురాలిగా కొన్ని స‌న్నివేశాల‌పైనే ప‌ట్టు ప్ర‌ద‌ర్శించారు. ‘మాట‌ల‌తో అయ్యే గాయం అంద‌రికీ ఒక్క‌టే, చావు జీవితం కంటే క్రూర‌మైన‌దేమీ కాదు… ’ ఇలా  కొన్ని సంభాష‌ణ‌లు బాగున్నాయి. మ‌రికొన్ని పెద్దగా అర్థం కావు. కె.వి.ఎన్‌.ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మాణం బాగుంది. ప్ర‌తీ స‌న్నివేశంలోనూ భారీద‌నం క‌నిపిస్తుంది.

  • బలాలు
  • + రాయ – నదియా మ‌ధ్య ప్రేమ
  • + య‌శ్ న‌ట‌న.. కొన్ని సంభాష‌ణ‌లు
  • + విజువ‌ల్ హంగులు
  • బలహీనతలు
  • – బ‌లం లేని క‌థ‌, క‌థ‌నం
  • – నిడివి
  • చివరిగా: టాక్సిక్‌… విష‌యం కంటే హింసే ఎక్కువ‌! (Toxic Movie Review)
  • కుటుంబంతో చూడొచ్చా?: సెన్సార్‌ బృందం A సర్టిఫికెట్‌ ఇచ్చింది. సినిమాలో హింసాత్మక, శ్రుతిమించిన సన్నివేశాలు ఉన్నాయి. 
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WordPress Archive Car Shire || Auto Mechanic & Repair WordPress Theme Car Wash – Auto Spa WordPress Theme Car Zone – Towing & Repair WordPress Theme Carbon – Car Service Elementor Template Kit CarCare – Auto Service & Repair Elementor Template Kit Card Slider – Addon for WPBakery Page Builder Carddio – Card Payment & Online Banking Elementor Template Kit CarDealerz – Auto Dealer & Auto Shop Website Elementor Template Kit Cardioly – Cardiologist and Medical WordPress theme CardLab – Prepaid Card Selling WordPress Plugin